calender_icon.png 29 December, 2024 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వాడాలి

29-12-2024 02:19:36 AM

ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సలహాదారులు యాదగరి 

 హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బీఐఎస్ ప్రమాణాలతో కూడిన విద్యుత్ పరికరాలను వినియోగించడం ద్వారానే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సలహాదారులు, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యుడు నక్కా యాదగిరి అన్నారు. విద్యుత్ ప్రమాదాలలో లోపాలను పరిశీలన చేసే క్రమంలో శనివారం తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు  పలు కంపెనీలు తయారు చేసిన పరికరాలను అధ్యయనం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ.విద్యుత్ మరమ్మతులను క్వాలిఫైడ్ ఎలక్ట్ట్రీషియన్స్‌తో మాత్రమే చేయించాలన్నారు. అతుకులు కలిగిన తీగలు, లూజ్ వైరింగ్ ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఈసీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్, శ్రీనివాస్ రెడ్డి, వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.