28-03-2025 01:26:17 AM
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): గత ఆర్థిక సంవత్సరం (2023 ఆమోదించిన బడ్జెట్‌లో 79శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినట్లు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ నివేదికలో వెల్లడించింది.
ఆ ఏడాది బడ్జెట్ అంచనా రూ.2.77 లక్షల కోట్లు కాగా, సర్కార్ దానిలో రూ.2.19 లక్ష ల కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేసింది. ఈ నివేదికను గురువారం అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వం ఆమోదం లేకుండా అదనంగా రూ.1.11లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. ఇది జీఎస్‌డీపీలో 15శాతమని తెలిపారు. గతేడాది ప్రభుత్వం 145రోజుల్లో రూ.35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నదని స్పష్టం చేశారు.
వడ్డీలకే రూ.24,347 కోట్లు..
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం కేవలం వడ్డీలకే రూ.24,347 కోట్లు చెల్లించినట్లు కాగ్ వెల్లడించింది. ఉద్యోగుల జీత భత్యాలకు రూ.26, 981 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. గతేడాది సర్కార్‌కు సొంత రాబడులు రూ.1,69,293 కోట్లు రాగా, దీనిలో ట్యాక్స్ రెవెన్యూ 61.83శాతమని పేర్కొన్నది. 2023 నాటికి సర్కార్‌కు రూ.4,03,664 కోట్ల మేర అప్పు ఉందని తెలిపింది.
అలాగే కార్పోరేష న్ ద్వారా తెచ్చిన రుణం మరో రూ. 2.20 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నది. ఇలా మొత్తం రుణం రూ.624,271కోట్లని స్పష్టం చేసింది. అలాగే గతేడా దిలో సర్కార్ మరో రూ.53,144 కోట్లు అదనంగా అప్పు తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం రూ.37,525 కోట్లను మూలధన వ్యయంగా బడ్జెట్ లో అంచనా వేయగా, అది కాస్త అం చనాలు మించి రూ.43,918 కోట్ల ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది. స్థాని క సంస్థల కోసం రూ.76,773 కోట్లు వెచ్చించిందని వెల్లడించింది. ఇది బడ్జెట్‌లో 11శాతం అదనపు ఖర్చు అని పేర్కొన్నది.