calender_icon.png 10 October, 2024 | 3:52 AM

వారానికి ఓసారి మాత్రమే!

05-10-2024 12:00:00 AM

తలకు మసాజ్ చేయించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో సమయం కుదరక ఎంతోమంది మసాజ్ జోలికి వెళ్లరు. నిజానికి వారంలో ఒక్కసారి తలకు మసాజ్ చేయించుకుంటే.. వారం అంతా ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. మెదడు చక్కగా ఆలోచిస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ప్రతిదీ ఆచితూచి అడుగేస్తారు. 

తలకు తేలికపాటి మసాజ్ చేయడం వల్ల రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఈ ప్రసరణ వల్ల మెదడులో ఆక్సిజన్ పోషకాలను అధికంగా పొందుతుంది. ఇది అభివృద్ధి పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. ఒత్తిడి అనేది మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఒత్తిడి కారణంగానే ఎంతోమంది వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నారు.

తలకు మసాజ్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మసాజ్ చేసే సమయంలో సున్నితమైన స్ట్రోక్స్ వేళ్లతో ఇస్తూ ఉంటారు. ఇది ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది. తలపై ఉండే మాడును మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. రక్తపోటు, హృదయస్పందన రేటు కూడా సానుకూలంగా మారుతాయి. 

జుట్టు పెరుగుదల: జుట్టు ఆరోగ్యానికి హెడ్ మసాజ్ ఎంతో ఉపయోగపడుతుంది. తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఇవి జుట్టు పెరుగుదలను పెంచుతాయి. భావోద్వేగాలను మెరుగుపరిచి మెదడు చక్కగా పనిచేసేలా చేస్తుంది. బాదం, కొబ్బరి లేదా ఆలివ్ నూనెలతో హెడ్ మసాజ్ చేసుకోవచ్చు. ఈ నూనెలో గోరువెచ్చగా వేడి చేసి ఆ తర్వాత తలకు మసాజ్‌కి ఉపయోగించాలి. ఇలా చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది.