17-03-2025 05:15:44 PM
ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ బి జనక్ ప్రసాద్...
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి సంస్థ సంరక్షణ ఐఎన్టిసి తోనే సాధ్యమని ఐఐటిసి సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిని పరిరక్షించే సత్తా ఐఎన్టియుసి యూనియన్ కే ఉండని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిని ముంచడమే బిఆర్ఎస్, టీబీజీకేఎస్ లక్ష్యం అని ఆయన విమర్శించారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటియుసి పూర్తిగా విఫలమైందనీ కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమై కార్మికుల విశ్వాసాన్ని కోల్పోయిందనీ ఆయన ఆరోపించారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కళను నెరవేర్చడంతో పాటు పెర్క్స్ పై ఆదాయం పన్ను మాఫీ చేపిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర, సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొట్ట మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు లాభాల వాటాను ఇప్పించామని ఆయన గుర్తు చేశారు. కార్మికులకు నిత్యం అందుబాటులో ఉండీ వారి సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, రాంశెట్టి నరేందర్, పానుగంటి వెంకటస్వామి లు పాల్గొన్నారు.