calender_icon.png 10 January, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనదేశాన్ని తక్కువ చేసి చూపిస్తేనే ఆస్కార్‌కు..

09-01-2025 12:00:00 AM

ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరతీస్తూ ఉండే నటీమణుల్లో కంగనా రనౌత్ ఒకరు. తాజాగా ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. ఆస్కార్‌కు ఎంపికైన చిత్రాల జాబితాపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కంగనా ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే కంగనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

మన దేశానికి వ్యతిరేకంగా తీసిన సినిమాలకే ఆస్కార్‌లో స్థానం దక్కిం దని.. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ్యానిం చింది. “మన దేశానికి వ్యతిరేకంగా రూపొందిన సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక అవుతున్నాయి. ఆస్కార్‌కు ఎంపికైన చిత్రాలన్నీ భారతదేశానికి వ్యతిరేకం.

అలాంటి చిత్రాలకే ప్రశంసలు దక్కుతున్నాయి. మన దేశాన్ని తక్కువ చేసి చూపించే చిత్రాలే ఆస్కార్‌కు నామినేట్ అవుతున్నాయి. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలైతే ఆస్కార్‌కు ఓకే” అని కంగనా పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా ఇందిరా పాత్రను పోషించారు.