calender_icon.png 17 January, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజం నాకు మాత్రమే తెలుసు!

03-09-2024 03:04:01 AM

రాజ్ తరుణ్ కేసు రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. ఈ కేసు ఆరోపణలు, ప్రతి ఆరోపణలకే పరిమితం అవుతుంది తప్పా.. ఓ కొలిక్కి మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ మరోసారి పరోక్షంగా స్పందించారు. తాజాగా పాడ్‌కాస్ట్‌లో లావణ్య ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. “మనుషులు కావాలని తప్పులు చేయరు. పరిస్థితులు వారి చేత తప్పులు చేయిస్తాయి. లావణ్య కేసులో అసలు నిజాలు నాకు మాత్రమే తెలుసు. అవన్నీ మీడియా ముం దుకొచ్చి చెప్పలేను. కావాలంటే న్యాయస్థానంలో నేనెంటో నిరూ పించుకుంటా.

అంతేకానీ.. అనవసర ఆరోప ణలు చేయను. నా దగ్గర వంద సాక్ష్యాలున్నాయి. ఒకరిని జడ్జ్ చేయడం తప్పు.. ఎవరో తప్పు.. ఎవరు ఒప్పో త్వరలోనే తెలుస్తుంది” అని రాజ్ తరుణ్ అన్నారు. కాగా సహజీవనం చేసిన తనను మోసం చేశాడంటూ లావణ్య హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తాను 2012 నుంచి ప్రేమించుకుంటున్నామని, కొన్ని రోజులు ఒక గదిలో ఉంటూ సహజీవనం చేశామని లావణ్య ఆరోపణలు చేస్తూనే ఉంది.