calender_icon.png 21 December, 2024 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఎల్‌కు మాత్రమే

15-10-2024 01:48:02 AM

న్యూఢిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్ లో ప్రభావం చూపించిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలగిస్తున్నట్లు సోమవారం పేర్కొంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీసుకొచ్చిన బీసీసీఐ తాజాగా అదే టోర్నీ ద్వారా దీనిని తొలగించనుంది. కాగా ఐపీఎల్‌లో మాత్రం 2027 వరకు ఇంపాక్ట్ రూల్ కొనసాగనుందని స్పష్టం చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ సహా మరికొంతమంది మాత్రం ఇంపాక్ట్ రూల్‌ను తప్పుబట్టిన సంగతి తెలిసిందే.