షరతుల్లేవ్
5 నుంచి 7 వరకు రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
- 14 నుంచి చెల్లింపులు
- శాటిలైట్ మ్యాపింగ్‌తో సాగు భూముల గుర్తింపు
- స్పష్టంచేసిన మంత్రివర్గ ఉపసంఘం
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేగవంతం
హైదరాబాద్, జనవరి 2(విజయక్రాంతి): పంటవేసిన ప్రతి రైతుకు, సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా అభిప్రాయపడింది. తన అభిప్రాయాన్ని క్యాబినెట్ ముందు ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపు, భూమి పరిమితి తదితర అంశాలేవీ రైతు భరోసాకు షరతులుగా ఉండకూడదని అభి ప్రాయపపడ్డారు.
గురువారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం రెండోసా రి సమావేశమైంది. ఈ నెల 5 నుంచి 7 వరకు గ్రామ సభలు నిర్వహించి రైతుభరోసాపై ప్రచారం నిర్వహించాలని అభిప్రాయ పడినట్టు తెలిసింది. ఒక మండలాన్ని మూడు విభాగాలుగా చేసి మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించి, రైతు భరో సా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని భావిస్తున్నట్టు సమాచారం.
వీలైనంత త్వర గా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం తన అభిప్రాయాలను శనివారం జరిగే క్యాబినెట్ ముందు పెట్టనుంది. అయితే, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సంక్రాంతికే రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది.
శాటిలైట్ ద్వారా భూముల గుర్తింపు
అధికారులు సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించే ప్రక్రియ ను చేపట్టనున్నారు. జనవరి 5 నుంచి 7 వర కు రైతులంతా తమ గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సూచించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న సర్కా ర్ ఈనెల ౪న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ్యులుగా ఏర్పాటైన ఉపసంఘం ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించింది.
30% భూములు సాగు యోగ్యతలేనివే
ప్రభుత్వ అంచనాల ప్రకారం, గత ప్రభుత్వ వివరాల ప్రకారం 1.32 కోట్ల ఎకరాల భూమి ఉండగా, 69.99 కోట్ల మంది రైతులకు రూ. 7652 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. ఎలాంటి నిబంధన లు లేకుండా పాస్‌బుక్ కలిగిన వారందరికి రైతుబంధు పంపిణీ చేసింది. రేవంత్ సర్కార్ కొలువుదీరాక పెట్టుబడి సాయం అసలైన రైతులకు దక్కట్లేదని ఫిర్యాదులు రావడంతో అనర్హుల జాబితాను సిద్దం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
ఉమ్మడి జిల్లాల్లో పర్యటించిన ఈ కమిటీ 30 నుంచి 40 శాతం భూము ల్లో పంటలు పండించడం లేదని తేల్చింది. దీంతో కొండలు, గుట్టలు, రోడ్లు, కుంటలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామాల్లో ఇళ్లకు అమ్మిన భూములకు కూడా రైతుబంధు ఇచ్చినట్టు ఉపసంఘం గుర్తించింది.
వాటిని రైతు భరోసా జాబితా నుంచి ఇప్పటికే తొలగించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పాలనలో పంట సాగు చేసే అన్నదాతలకే సాయం అందించి యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తామని మంత్రు లు వెల్లడించారు. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా హాజరయ్యారు.