కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే దాన్ని సులువుగా చేరుకోవచ్చని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. బుధవారం తిర్యాని మండలంలోని పలువురు డీఎస్సీ, గ్రూప్-4 లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత లక్ష్యాన్ని సాధించేందుకు కటోర శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలని తెలిపారు. కొడుకు, కూతురుకు ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్, శ్రీనివాస్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.