calender_icon.png 23 April, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితభావంతో చేసే పనులే గుర్తింపునిస్తాయి

22-04-2025 08:18:30 PM

కుక్కునూరు పల్లి ఎంఈఓ బచ్చలి సత్తయ్య..

కొండపాక: ఉద్యోగ సమయంలో అంకితభావంతో చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని కుకునూరుపల్లి ఎంఈఓ బచ్చలి సత్తయ్య, కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయురాలు ఇందిర ఉద్యోగ విరమణ సమావేశం పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిర 42 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో విద్యార్థులను క్రమశిక్షణతో అంకిత భావంతో విద్యార్థులను తీర్చిదిద్దిన తర్వాత ప్రయోజకులైతే ఆ ఉపాధ్యాయులకు కావాల్సింది మరి ఏమి ఉండదని అన్నారు.

క్రమశిక్షణ గల కుటుంబంలో పెరిగి ఉద్యోగాన్ని సాధించిన ఇందిర తన ఉద్యోగ జీవితంలో ఎంతోమంది విద్యార్థులకు మంచి సంస్కారాన్ని అందించిందని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసిన గురువులను ఎప్పటికీ మర్చిపోరని సందర్భంగా పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి ఉండడం సహజమని ఉద్యోగ సమయంలోనే మంచి బోధనను అందించి ఉన్నతులుగా తయారు చేయడం వృత్తి ధర్మమన్నారు. ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇందిర కుటుంబ సభ్యులు మండలంలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఇందిర దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామచంద్రం, శంకర్, రాణి, సత్య కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.