05-04-2025 11:01:54 PM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
కడ్తాల్ (విజయక్రాంతి): స్థానిక సంప్రదాయ విత్తనాన్ని కాపాడుకుంటూనే అన్నదాతల కళ్ళల్లో ఆనందంతో పాటు సుస్థిర వ్యవసాయాన్ని కొనసాగించే పద్ధతులను అన్వేషించాలనీ శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి ఎర్త్ సెంటర్ లో నిర్వహిస్తున్న విత్తన పండుగ కార్యక్రమంలో శనివారం సాయంత్రం గుత్త సుఖేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ప్రస్తుతమున్న యువతని ఆకట్టుకోవాలనీ, వ్యవసాయంలో జీవనోపాధి, ఆరోగ్యం ఉందని వాళ్లకు నమ్మకం కలిగిస్తేనే మనం వ్యవసాయానికి కాపాడుకోగలుగుతామని, దానికి స్వదేశీ పద్ధతులు, విత్తనము, స్వదేశీ అన్నది మంచిదనీ, అయితే ప్రపంచ పోటీనీ కూడా తట్టుకునేలా వ్యవసాయ విధానాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అని ఆయన సూచించారు. విత్తనాలా స్టాల్స్ సందర్శించగా, లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫార్మర్ కమిషన్ కేబీఎన్ రెడ్డి, సిజిఆర్ వ్యవస్థాపకులు లీలా లక్ష్మారెడ్డి, సిజిఆర్ దొంతి నరసింహారెడ్డి, వ్యవసాయ నిపుణులు సునంద, లావణ్య తదితరులు పాల్గొన్నారు.