calender_icon.png 18 March, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షరాలు నేర్చుకుంటేనే ఉన్నత శిఖరాలకు

18-03-2025 12:12:28 AM

సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి 

సిద్దిపేట, మార్చి 17 (విజయక్రాంతి) : నేడు అక్షరాలు నేర్చుకుంటేనే రేపటి రోజు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ మారెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మారెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు డిక్షనరీలు అందించాలనే ఉద్దేశం చాలా గొప్ప విషయం అన్నారు. ఎంతోమంది ఆర్థికంగా ఉన్నా కూడా సమాజ సేవ చేయాలనే ఉద్దేశం కొద్దిమందికి మాత్రమే ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి డిక్షనరీల నుంచి భాష నేర్చుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్యాల సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ బొర్ర రాజబాబు, మాజీ ఉపసర్పంచ్ వాసూరి స్వామి, చల్లా విజయ్ కుమార్ రెడ్డి, కుంభం సురేష్ రెడ్డి, మా రెడ్డి  నరేందర్ రెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి,    ప్రధానోపాధ్యాయులు చింతల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.