calender_icon.png 13 March, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్‌ఐ హల్‌మార్క్ ఉన్న బంగారమే కొనాలి

12-03-2025 12:00:00 AM

బిజినెస్ ఇండియన్ స్టాండర్డ్ మాజీ అధికారి వీరయ్య

కామారెడ్డి, మార్చి 11 (విజయక్రాంతి) : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా బిఐఎస్ బిజినెస్ ఇండియన్ స్టాండర్డ్ హాల్ మార్కులు తప్పనిసరిగా  పరిశీలించి బంగారాన్ని కొనుగోలు చేయాలని బిజినెస్ ఇండియన్ స్టాండర్డ్స్ రిటైర్డ్ అధికారి వీరయ్య సూచించారు. మంగళవారం కామారెడ్డిలో బంగారు అభరణాల కొనుగోలు విషయంలో వినియోగదారులకు అవ గాహన సదస్సు పట్టణ స్వర్ణకార సంఘం భవనంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా బంగారు వినియోగదారులు, వర్తకులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు అభరణాల నాణ్యత పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. బంగారు అభరణాల కొనుగోలు సమయంలో ఆల్ మా ర్పులు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఆల్ మార్క్ ప్రామాణికతను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.

ఈ సదస్సు లో బిఐఎస్ ఆల్ మార్క్ అధికారులు ఓ వీర య్య, ప్రశాంతి, లు 70 మంది నగల వ్యాపారుల కు స్వర్ణకారులకు అవగాహన కల్పిం చారు. హల్ మార్కు ప్రామాణికతను గుర్తిం చి బంగారం కొనుగోలు చేస్తే నష్టం మోస పోకుండా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ బిఐఎస్ అధికారి వీరయ్యను ప్రశాంతి లను పట్టణ స్వర్ణకార సంఘం బంగారు వర్తక సంగం ప్రతినిధులు ఘనం గా సన్మానించారు.

ఎన్నో మేలుకోవలను నేర్పిన అధికారులకు బంగారు వార్తకులు స్వర్ణకారు లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వెండి బంగారు, అభరణాలు వర్తక సంఘం అధ్యక్షులు ఏ ఎం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి యనిశెట్టి బాలాజీ శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు యాడావరం  శ్రీనివాస్, శ్రీనివాస్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు అడ్లూరు ఎల్లారెడ్డి చక్రం, శ్రీనివాస్, మర్కంటి బ్రహ్మం, రాము, తదితరులు పాల్గొన్నారు.

(బిజినెస్ ఇండియన్ స్టాండర్డ్స్) సూచించిన  హల్ మార్కులు తప్పనిసరిగా పరిశీలించాలని బిఐఎస్ మాజీ అధికారి ఓ వీరయ్య వినియోగదారులకు సూచించారు. బంగారు ఆభరణాల నాణ్యతపై అవగాహనా సదస్సును కామారెడ్డి పట్టణంలోని స్వర్ణకర భవనం నందు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది నగల వ్యాపారులు మరియు స్వర్ణకారులు పాల్గొన్నారు.

బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో కొంత మంది చేసే మోసాలను అరికట్టేందుకు ఈ హాల్ మార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సరైన నాణ్యత గలా బంగారు ఆభరణాలు పొందేందుకు ఈ హాల్ మార్క్ ను బిఐఎస్ తప్పనిసరి చేసింది అన్నారు. బంగారు ఆభరణాల కొనుగోలు సమయంలో హాల్ మార్క్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా హాల్ మార్క్ ప్రామాణికతను సులభంగా గుర్తించవచ్చు అని తెలిపారు.

ఈ సదస్సులో బిఐఎస్ హాల్ మార్క్ అధికారులు వీరయ్య, ప్రశాంతి గార్లు వెండి బంగారు ఆభరణ అధ్యక్షులు, శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్, కోశాధి కారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జి శ్రీనివాస్, స్వర్ణకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు చక్రం, శ్రీనివాస్ పాల్గొన్నారు.