23-02-2025 07:52:45 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించడం బిజెపితోనే సాధ్యమని ఆ పార్టీ నాయకురాలు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రపతిగా ద్రౌపది మూర్ము, ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాకు అవకాశం అవకాశం ఇచ్చిందన్నారు. అంతేగాక మహిళల సంక్షేమానికి, ఆరోగ్యానికి ప్రత్యేక పథకాలు చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రసంగాలు ఇవ్వడం కంటే వారిని ముందు ఉంచితేనే సత్తా ఏమిటో తెలుస్తుంది అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళకు అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.