calender_icon.png 5 October, 2024 | 4:32 PM

ఆన్‌లైన్ వల.. అమాయకులు విలవిల

05-10-2024 12:27:35 AM

కొంపముంచుతున్న ఆన్‌లైన్ యాప్‌లు

ఈజీ మనీ వస్తుందని పెట్టుబడులు

మొదట్లో రోజువారీగా ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న నేరగాళ్లు

ఆపై మోసం

రంగారెడ్డి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేక యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని కొంత అమౌంట్ పెట్టుబడి పెడితే రోజువారీగా డబ్బులు వస్తాయంటూ ఊకదంపుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు.

అమాయకులు ఇది నిజమని నమ్మి సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్శితులవుతున్నారు. అత్యాశకు పోయి తమ స్థోమతకు మించిన డబ్బులు పెట్టుబడులుగా పెట్టి బోల్తాపడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు.

ఇటీవల రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వెల్‌జాల్ గ్రామంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారంతా వీడియోలు చూస్తూ సులువుగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఐఏఎస్ అనే యాప్ నిర్వాహకులు ప్రచారం చేశారు. దీంతో వెల్‌జాల్, చుట్టపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది యాప్‌లో చేరారు. ఆపై రూ.కోటికి పైగా మోసపోయారు. ఇలాంటి ఎన్నో యాప్‌ల కారణంగా అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు.  

రూ.కోటికి పైగా మోసం 

వెల్‌జాల్ గ్రామానికి చెందిన వారికి కొందరు వ్యక్తులు శంషాబాద్‌లోని ఐఏఎస్ (ఇరీడన్ అడ్వర్టుజింగ్ సొల్యూషన్స్) యాప్‌ను పరిచయం చేశారు. యాప్‌లో సులువుగా డబ్బులు సంపాదించవచ్చని వందలాది మంది యాప్‌లో చేరారు. అందులో మూడు విభాగాలుగా రూ.2,200, రూ.5,500, రూ.18,300 గా పెట్టబడులు పెట్టారు.

యాప్ లో డబ్బులు చెల్లించిన వారు యాప్‌లో వచ్చే వీడియోలను లైక్ చేస్తూ స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేస్తే వారి ఖాతాలోకి కొంత అమౌంట్‌ను జమ చేసేవారు. మొదట్లో ఈ తతంగం అంతా బాగా నే  సాగింది. పెట్టుబడి పెట్టిన వారికి రెగ్యులర్‌గా డబ్బులు వస్తుండడంతో వారి స్నేహితులు, బంధువులతో కూడా యాప్ లో డబ్బులు పెట్టించారు.

ఇలా వెల్‌జాల్ గ్రా మంలో దాదాపుగా 1,000 మంది వరకు, చుట్టుపక్కల గ్రామాల వారు మరో 200 మంది వరకు యాప్‌లో డబ్బులు పెట్టినట్లు సమాచారం. యాప్‌లో గొలుసుకట్టు విధా నం లాగా మరొకరిని చేర్పిస్తే రూ.10 వేల నుంచి రూ.22 వేలకు పైగా వారి ప్రత్యేక వాలెట్‌లో నిర్వాహకులు జమ చేసేవారు. ఆ తర్వాత వరుసగా ఆక్టివిటీలు చేస్తున్నా యాప్ నుంచి ఎలాంటి డబ్బులు రావడం లేదు.

యాప్ ఇన్‌యాక్టివ్ అయింది. దీంతో మోసపోయామని గుర్తించిన వెల్‌జాల్ గ్రా మంలోని వారితో పాటు వెంకటాపూర్, మా దాయిపల్లి, అంతారం, చౌదరపల్లి, చెన్నంపల్లి, పడకల్, మిడ్జిల్, తలకొండపల్లి మండలంలో పలువురు బాధితు లు శంషాబాద్‌లోని ఐఏఎస్ యాప్ కార్యాలయానికి వెళ్లా రు. తాళాలు వేసి ఉండడంతో వాపోతున్నారు.

ఒకరికి తెలవకుండా మరొకరు..

మరోపక్క బాధితులకు కొత్త భయం పట్టుకుంది. యాప్‌లో చేరిన వారంతా తమ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పూర్తి డాటా యాప్‌లో పొందుపర్చారు. దీంతో భవిష్యత్‌లో తమకు సైబర్ ముప్పు పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని ఆందోళనకు గురవుతున్నారు.

బాధితులలో ప్రధానంగా మహిళలే అధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఒకే ఇంట్లో వారు సైతం ఒకరికి తెలవకుండా మరొకరు యాప్‌లో డబ్బులు పెట్టి మోసపోయారు. షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి నేతృత్వంలో ప్రత్యేకంగా పోలీసులు మండలంలోని గట్టుప్పలపల్లి, వెల్‌జాల్, తలకొం డపల్లి, వెంకటాపూర్ గ్రామాలో పర్యటించి యాప్ గురించి ఆరాతీశారు. 

నకిలీ యాప్‌తో రూ.13 లక్షలు స్వాహా?

వెల్దుర్తి: వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల యువకులు ఆన్‌లైన్ యాప్ లో డబ్బులు పెట్టి సుమారు రూ.13 లక్షల వరకు మోసపోయిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఉప్పులింగాపూర్ గ్రామంతో పాటు మరో రెండు గ్రామాలకు చెందిన కొందరు యువకులు ‘సెయింట్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసు కొని అందులో డబ్బులు పెట్టి మోసపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

ముందుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రూ.1000 పెడితే నిర్వాహకులు అదనంగా రూ.1000 కలిపి అకౌంట్‌లో జమ చేసేవారు. ఇలా ఎంత డబ్బు పెడితే రెట్టింపు డబ్బు వారి అకౌంట్లో జమ చేసేవారు. దీంతో గ్రామంలోని యువకులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇంట్లో వారికి తెలియకుండా డబ్బులను పెట్టారు. మొద ట్లో వారు పెట్టిన డబ్బుకు రెట్టింపు డబ్బులు రావడంతో ఆకర్షితులయ్యా రు.

దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా బయట అప్పులు చేసి ఒక్కొ క్కరు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు యాప్ అకౌంట్‌లో జమచేశారు. అంతా కలిపి సుమారు రూ.13 లక్షల వరకు జమకాగా, ఆ తర్వాత నిర్వాహకులు యాప్‌ను తొలగించారు.

తీరా డ బ్బులు పోయాక తాము మోసపోయామని గుర్తించారు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక యువకులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. ఈ యాప్ వలలో మరో రెండు గ్రామాలు కూడా ఉన్నట్లు సమాచారం. 

మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు

సైబర్ నేరాలు, మోసాలపై కళాకారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు మోసపూరిత ప్రకటనలు నమ్మొదు. సులువుగా డబ్బులు రావనే విషయం గుర్తించాలి. ఐఏఎస్ యాప్ మోసం గురిం చి మాకు సమాచారం ఉంది. అయి తే, బాధితులు ఎవరూ ఇప్పటివరకు మాకు ఫిర్యాదు చేయలేదు. యాప్ మోసాల గురించి ఆరా తీస్తున్నాం. ప్రధానంగా వెల్‌జాల్ ముఖ్య కేంద్రంగా దందా ఎక్కువ జరిగినట్లు గుర్తించాం.

 ప్రమోద్‌కుమార్, సీఐ, 

ఆమనగల్లు