calender_icon.png 18 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చంపేటలో ఆన్‌లైన్ ఘరానా మోసం!

18-01-2025 02:01:30 AM

  1. ఆశపడి.. మోసపోయిన సామాన్యులు  
  2. లక్షల్లో పెట్టుబడులు.. కోటికి పైగా ఆన్‌లైన్ ఆప్ మోసం 
  3. బోర్డు తిప్పేసిన డేకత్‌లాన్ యాప్

అచ్చంపేట జనవరి 17 : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో భారీగా ఆన్‌లైన్ మోసం జరిగిన విషయం వెలుగు లోకి వచ్చింది. “డేకత్ లాన్‌” అనే ఆన్‌లైన్ యాప్ ద్వారా అమాయకులను బురిడీ కొట్టించిన నేరగాళ్లు, పెట్టుబడుల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత యాప్ బోర్డు ఎత్తేశారు.

ప్రారం భంలో ఈ యాప్ ద్వారా 3 వేల నుండి 5వేల వరకు లాభాలు చెల్లించడానికి ప్రలో భపెట్టిన మోసగాళ్లు, లక్షల్లో పెట్టుబడులు పెట్టిన తరువాత యాప్ పనిచేయకపోవ డంతో బాధితులు మోసపోయినట్లు గ్రహిం చారు. మొత్తంగా అధిక మిత్తి డబ్బులకు ఆశపడి ఈ యాప్ ద్వారా వందల మంది చిరు ఉద్యోగులు కోటి కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయా రని తెలుస్తోంది. 

గురువారం రాత్రి నుండి ఈ యాప్ పనిచేయకపోవడంతో బాధితు లంతా అయోమయంలో పడ్డారు. కానీ ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించేందుకు బాధితులు వెనకబడుతుండడం విశేషం. ఈ మోసం ప్రస్తావనతో స్థానికులలో ఆందోళన పెరిగింది, యాప్ యొక్క నిర్వాహకులు సంబంధిత అధికారులుపై విచారణ కొనసా గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.