calender_icon.png 28 November, 2024 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌కు ఆన్‌లైన్ కోచింగ్

21-10-2024 01:43:40 AM

  1. నేటి నుంచి టీ-సాట్‌లో ప్రసారాలు
  2. యువత సద్వినియోగం చేసుకోవాలి
  3. టీ సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేసే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ కోచింగ్ అందించనున్నట్లు టీ-సాట్ సీఈవో బోధనపల్లి వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 21 నుంచి జనవరి 31, 2025 వరకు టీ-సాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్ కంటెంట్ అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఎస్‌ఎస్‌సీ 2024, సెప్టెంబర్ 6న కేంద్ర ప్రభుత్వం 39,481 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా నియామకం జరిగే కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 35,612 మంది పురుషులు, 3,869 మంది మహిళలకు అవకాశం లభిస్తుందని చెప్పారు. తెలంగాణకు నుంచి 718, ఏపీ నుంచి 908 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని యువత ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అరగంట నిడివి ఉన్న 448 ఎపిసోడ్స్ 224 గంటల్లో 112 రోజులు టీ-సాట్ నెట్‌వర్క్ ఛానళ్లు, యూట్యూబ్, యాప్ ద్వారా అందించనున్నామని పేర్కొన్నారు.

పోటీ పరీక్షలకు అవసరమయ్యే నాలుగు సబ్జెక్టులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ ల్యాంగేజ్‌ల్లో కంటెంట్ అందించనున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్యర్యంలో నవంబర్ 17వ తేదీన జరిగే 1,388 గ్రూప్-3 పోస్టుల పరీక్షలకు కంటెంట్‌ను మరో రెండు గంటలు అదనంగా అందించనున్నామని సీఈవో తెలిపారు.