calender_icon.png 30 October, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లెన్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు

06-07-2024 01:28:54 AM

రూ.33.01 లక్షల నగదు స్వాధీనం

పోలీసుల అదుపులో నిందితులు

పెద్దపల్లి, మంథని, జూలై 5 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు అయింది. పోలీసులు ఓ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఎస్సైలు శ్రావణ్ కుమార్, నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శుక్రవారం సుల్తానాబాద్‌లో వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారును అడ్డుకున్నారు.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు కారును సోదా చేశారు. ఒక బ్యాగులో రూ.33 లక్షల నగదును గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా బెట్టింగ్ విషయం బయటపడింది. క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తూ వారు భారీగా నగదు సేకరించినట్లు విచారణలో వెల్లడించారు. నిందితులను గోదావరిఖనికి చెందిన ముల్కల రాజ్‌కుమార్, చిన్నపల్లి అభిలాష్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిమ్మ ధనుంజయ్‌గా పోలీసులు గుర్తించారు.