* రూ.30 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
* మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య
* వరంగల్ జిల్లా ఇల్లందలో ఘటన
జనగామ, జనవరి 11 (విజయ క్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.33 లక్షలు పోగొట్టుకున్న యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటు చేసుకుంది. ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి భాగ్యలక్ష్మి దంపతుల మూడో కుమారుడు రాజుకుమార్ డిగ్రీ పూర్తి చేశాడు.
కొన్ని రోజులుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటుపడి, రూ.30 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇటీవల మరో రూ.4 లక్షల కోసం తండ్రిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
అయితే రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపానికి గురైన రాజు కుమార్ శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మె ల్యే కెఆర్ నాగరాజు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.