12-03-2025 08:03:19 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యుత్ శాఖ ద్వారా అందిస్తున్న సేవల్లో పారదర్శ కథ కోసం ఆన్లైన్ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుదర్శన్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు సేవలు అందించేందుకు ప్రమాదాల నివారణ సిబ్బంది పనితీరు మీటర్ రీడింగ్ తప్పులు కొత్త సర్వీసులు ఏర్పాటు తదితర వార్డ్ కోసం టీఎస్ ఎంపీడీసీఎల్ ఆధ్వర్యంలో యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయని దాని సద్వినించుకోవాలని కోరారు. జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు 19 12 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వి నీ యోగం చేసుకోవాలని ఆయన కోరారు.