calender_icon.png 29 November, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ చెకింగ్‌కు ఆన్‌లైన్ యాప్

29-11-2024 02:31:08 AM

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, గురుకు లాల్లో విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతకు సంబంధించి ప్రత్యేక కమిటీలు, మాని టరింగ్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపా రు. సీఎం ఆదేశాల మేరకు ఫుడ్ క్వాలిటీ అం శంపై పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సభ్యులు, అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ చెకింగ్ కోసం ప్రత్యేక ఆన్‌లైన్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఏ పూటకాపూట కూరగాయలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ ఫొటో లు అందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. యాప్ అందుబాటులోకి వచ్చేంత వరకు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు పంపేలా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు కలెక్టర్ అధ్య క్షతన జిల్లా అధికారులతో కమిటీలు వేస్తామ ని చెప్పారు. గురుకుల విద్యార్థులకు ఇకపై నిత్యం ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఇతర సప్లిమెంటరీ క్వాలిటీ ఫుడ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈక్రమంలో కమిషన్ సభ్యుడు వెంకటేశ్ వికారాబాద్‌లోని ఓ పాఠశాలను సందర్శించి విద్యార్థుల తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.