calender_icon.png 15 November, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండెక్కిన ఉల్లి ధరలు

12-11-2024 12:43:26 AM

పుణెలో కిలో ధర రూ.80 90

ముంబై, నవంబర్ 11: మహారాష్ట్రలో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. కొద్దిరోజులుగా కిలో రూ.40 చొప్పున పలికి న ధర, సోమవారానికి రూ.80 90కి పెరిగింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన అకా ల వర్షాల కారణంగా రాష్ట్రంలో సాగు చేస్తు న్న ఉల్లి పంట భారీస్థాయిలో దెబ్బతిన్నది. ఫలితంగా మార్కెట్లలో డిమాండ్‌కు తగిన ఉల్లి సప్లు నిలిచిపోయింది.

పుణె మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులు ప్రస్తుతం సప్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. డిమాండ్‌కు తగిన సప్లు సమకూర్చేందుకు ప్రత్యా మ్నాయమార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తు తం దొరికిన కాస్తంతా ఉల్లికి కిలోకు రూ.45 చొప్పున వెచ్చించి మార్కెట్‌కు తీసుకొస్తున్నారని తెలిసింది. ఉల్లి ధరల పెరుగుదల సామాన్య జనం పైనే కాకుండా హోటల్ యాజమాన్యాలపైనా పడనున్నది.