హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు సోమవారం హైదరాబాద్ లోని రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్లారు. ఒంగోలు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీ విచారణ కు వెళ్లాల్సి ఉంది. విచారణకు హాజరుకాకపోవడంతో ఆర్జీవీని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ ను కించపరుస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వర్మ పోస్టులపై పోలీసులకు టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదుతో మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.