calender_icon.png 22 January, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి మున్సిపల్ లో కొనసాగుతున్న వార్డు సభలు

22-01-2025 04:37:48 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో బుధవారం రెండవ రోజు వార్డు సభలు కొనసాగాయి. కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులను అర్హులైన వారిని అధికారులు, వార్డ్ ఆఫీసర్లు స్థానిక కౌన్సిలర్ల సమక్షంలో స్వీకరించారు. పలుచోట్ల వార్డుల్లో నిర్వహించిన సభల్లో బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావులు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అర్హులైన నిరుపేదల నుండి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.