calender_icon.png 16 January, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న విద్యార్థినుల నిరసన

08-08-2024 03:14:07 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): నిజాం కాలేజీలోని గర్ల్స్ హాస్టల్‌ను డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని ఆ కాలేజీ విద్యార్థినులు చేపడుతున్న నిరసన కొనసాగుతోంది. బుధవారం రాత్రి సైతం సెల్‌ఫోన్ల వెలుతురులోనే విద్యార్థినులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఆందోళన చేస్తున్నప్పటికీ కాలేజీ యాజమాన్యం పట్టించుకోకుండా డిగ్రీ, పీజీ విద్యార్థినులకు సమానంగా అడ్మిషన్లు ఇస్తామని ప్రకటన విడుదల చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌ను డిగ్రీ విద్యార్థినులకే కేటాయించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.