బాలికపై అత్యాచారం చేసి కాలువలో పడేసిన నిందితులు
మూడు రోజులగా కొనసాగుతున్న గాలింపు చర్యలు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఆదివారం మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలికపై అత్యాచా రం జరిపి కాలువలో పడేసిన ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక ఆచూకి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మూడు రోజులుగా చేస్తున్న ప్ర యత్నాలు ఫలించలేదు. దీంతో, గురువారం విజయవాడ నుంచి గజ ఈతగాళ్ళను రప్పిం చి కాలువలో ముమ్మరంగా గాలింపు చర్య లు చేపట్టారు. అయినప్పటికీ, బాలిక ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామానికి చెందిన ఏనిమిదేళ్ల బాలిక ఆదివారం అదృశ్యమైంది.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను అత్యాచారం చేసి హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కాలువలో పడేసినట్లు అంగీకరించారు. అదే రోజు సాయం త్రం నుంచి కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆచూకి తెలియకపోవడంతో గురువారం గజ ఈతగాళ్ళ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యా ఘటన స్థలానికి చేరుకుని బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.