నిజాంసాగర్: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ భాగం నుంచి ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో సోమవారం రాత్రి నుంచి మూడు వరద గేట్ల ద్వారా విడుదల చేశారు. మంగళవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 నీటి నిల్వకు గాను 1404.94 అడుగులు 17.71 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3200 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా కానీ ప్రాజెక్టు మూడు వరద గేట్ల నుంచి 12,150 క్యూసెక్కుల నీటిని మంజీరా లోకి విడుదల చేస్తుండగా మరో 500 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ఎగువ భాగంలో గల సింగూరు ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో వస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు నీటిని సోమవారం రాత్రి 12 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని నిజాంసాగర్లోకి విడుదల చేస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా పెరగనుండడంతో అధికారులు ముందుగానే నీటి విడుదలను పెంచి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.