calender_icon.png 20 April, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్

20-04-2025 12:11:26 AM

32 అక్రమ మోటార్లు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): గ్రేటర్, సహా ఓఆర్‌ఆర్ పరిధిలో నల్లాలకు అక్రమంగా మోటార్ల తో నీటిని తోడుతున్న వారిపై దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జలమండలి అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న 32 మోటార్లను అధికారులు సీజ్ చేశారు. నీటి వృధా చేసినందుకు మరో 42 మందికి పెనాల్టీ విధించారు.  ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.