calender_icon.png 20 March, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కొనసాగుతున్న దర్యాప్తు

20-03-2025 09:45:08 AM

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 11 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని కొందరు యూట్యూబర్లు కోరినట్లు పోలీసులు తెలిపారు. ఇకపై యాప్స్ కు ప్రచారం చేయబోమని మరికొందరు యూట్యూబర్లు(YouTubers) పోస్టులు పెట్టారు. మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ(Enforcement Directorate) అధికారులు అనుమానిస్తున్నారు. అక్రమ బెట్టింగ్(Illegal betting) దరఖాస్తులను ప్రోత్సహించారనే ఆరోపణలతో హైదరాబాద్ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (Yuvajana Sramika Rythu Congress Party ) అధికార ప్రతినిధి శ్యామల, 11 మంది యూట్యూబర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.  నిందితుల జాబితాలో హర్ష సాయి, విష్ణు ప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, బండారు శేషాయని సుప్రిత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ వంటి అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, టెలివిజన్ ప్రముఖులు ఉన్నారు.