డీఎం, సీఐలను విచారించిన విజిలెన్స్
కామారెడ్డి, నవంబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డీఎం, సీఐలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. కామారెడ్డి డిపో పరిధిలోని సెక్యూరిటీ కార్యాలయంలో డీఎం, సీఐ లతను వేర్వేరుగా విచారించారు. కరీంనగర్ విజిలెన్స్ డీఎస్పీతో పాటు నిజామాబాద్, హైదారాబాద్‌కు చెందిన విజిలెన్స్ సీఐలు విచారణలో పాల్గొన్నారు. కార్మికుల నుంచి డబ్బు లు వసూలు చేయడమే కాకుండా డ్యూటీ విషయంలో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న డీఎం తీరుపై జేఏసీ నాయకులు ఆర్టీసీ ఎండీ, రవా ణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీ సీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారు లు విచారణ చేపట్టారు.