27-04-2025 12:37:20 AM
8వ రోజుకు కొనసాగిన కాంట్రాక్టు ప్రొఫెసర్ల నిరసనలు
మద్దతు తెలిపిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తమను రెగ్యులరైజ్ చేసి, సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో కాంట్రాక్టు అసిస్టెంటు ప్రొఫెసర్లు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయా యూనివర్సిటీల్లో అధ్యాపకులు వివిధ రూపాల్లో తమ నిరసను వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీలో నిరవధిక సమ్మెలో భాగంగా దీక్ష కొనసాగింది. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధ్యాపకులు బైఠాయిం చి నిరసన తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసి, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయా లని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. సీఎంకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.
పాలమూరు విశ్వవిద్యాలయంలో వీసీ ఛాంబర్‌లో అధ్యాపకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీ డీకే అరుణ హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద సం ఖ్యలో వచ్చి సమ్మెకు మద్దతు తెలిపారు. హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన తెలిపారు. ఐఐఐటీ బాసరలో కాం ట్రాక్టర్ అధ్యాపకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహిషాసుర మర్దిని వేషంలో నిరసన తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లోనూ సమ్మె కొనసాగింది.
ఎందుకు రెగ్యులరైజ్ చేయరు?: తీన్మార్ మల్లన్న
ఉస్మానియా వర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మెకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. గతంలో డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసినప్పుడు లేని ఇబ్బందు లు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తేనే వస్తున్నా యా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెగ్యులరైజ్ చేసేందుకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభు త్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సీఎంకు అసదుద్దీన్ ఓవైసీ లేఖ
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను పరిష్కరించాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. శనివారం నాంపల్లి దారుసలాంలో అసదుద్దీన్ ఓవైసీని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా తాము యూనివర్సిటీలో కాం ట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సీఎం, విద్యాశాఖ మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు కాంట్రాక్ట్ అధ్యాపకులు చెప్పారు.