నిర్మల్/కామారెడ్డి, డిసెంబర్ 20 (విజయక్రాంతి): సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. శుక్రవారం కామా రెడ్డిలో బోనాలతో ఉరేగింపు నిర్వహించి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్తబస్టాండ్ వద్ద ఉన్న మైసమ్మ ఆలయం వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా అనుగ్రహం కల్పించాలని మొక్కుకున్నారు. నిర్మల్‌లో ఉద్యోగులు చీపుర్లు పట్టి రోడ్లను ఊడ్చి, నిరసన తెలిపారు.