calender_icon.png 28 April, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న ఇళ్ల కూల్చివేత

28-04-2025 01:52:36 AM

  1. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారితో సహా నిషేధిత సంస్థలకు చెందిన వ్యక్తులవి కూడా..
  2. ఇప్పటికి 9 ఇళ్లు నేలమట్టం
  3. మిగతావారికి కూడా ఇదే శిక్ష: అధికారులు

అనంతనాగ్, ఏప్రిల్ 27: పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉందని భావిస్తున్న ఉగ్రవాదుల ఇండ్ల కూల్చివేత కొనసాగుతోంది. లష్కరే తోయి బా ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల ఇండ్లను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఆదివారం కూడా ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని భావిస్తున్న పలువురి ఇండ్లను కూల్చేశారు.

దీంతో ఇప్పటివరకు కూల్చివేతలో ఇండ్లు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఈ తొమ్మిది మంది మాత్రమే కాదు.. మిగతా ఉగ్రవాదులపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటా మని అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రస్థావరాలను గుర్తించేందుకు 60కి పైగా ప్రాంతా ల్లో అధికా రులు దాడులు నిర్వహించారు.  ఉగ్రవాదు ల కోసం భద్రతాబలగాలు ముమ్మర ంగా గాలిస్తున్నాయి. 

22 గంటల ట్రెక్కింగ్

పహల్గాం దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐడీ కార్డులు చూసి మరీ హిందువులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. కాల్పులు జరిపిన బైసరన్ లోయకు వారంతా కాలినడకన వచ్చారని తెలుస్తోంది. మొత్తం నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. వారిలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు కాగా.. మరొకరు స్థానిక ఉగ్రవాది అని అధికారులు తెలిపారు. ఆదిల్ థోకర్ అనే స్థానిక ఉగ్రవాది దాడిలో పాల్గొన్నట్టు తేల్చారు.  

ఎన్‌ఐఏ చేతికి.. 

పహల్గాం ఉగ్రదాడి కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. దీంతో ఎన్‌ఐఏకు చెందిన బృందాలు పహల్గాంలో విచారణను ప్రారంభించాయి. ఉగ్రదాడి జరిగిన సమయంలో ముష్కరులను చూసిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ను ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఎన్‌ఐఏ అధికారు లు విచారించారు. అంతకు ముందు ఈ కేసును భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు విచారించారు.