ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య ఇప్పటికే 10 కోట్ల మార్కును దాటేసింది. జనవరి 29న మౌని అమావాస్య కోసం ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మౌని అమావాస్యను పురస్కరించుకుని అనేక మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.