calender_icon.png 4 April, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న బూడిద తోలకాలు

04-04-2025 12:14:24 AM

  1. అనుమతులు లేకున్నా యథేచ్ఛగా బూడిద తరలింపు 
  2. అక్రమాలకు జెన్కో అధికారుల అండదండలు ?

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 3 ( విజయ క్రాంతి): వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో ఉంటే ఏంటి అన్న చందాన ఉంది జన్కో అధికారుల తీరు. ఇచ్చిన కాల వ్యవధి పూర్తయిన, సేల్ ఆర్డర్ పొడిగింపులకు అనుమతులు లేకున్నా బూడిద తొలకాలకు మాత్రం బ్రేక్ పడటంలేదు.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5,6 దశల బూడిద చెరువు నుంచి బూడిద తోలకాలకుకోర్టు ఆర్డిన తుంగలో తొక్కి జనకో అధికారులు కొంత మందికి బూడిదకు సేల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ సెల్ ఆర్డర్ పుణ్యకాలం మార్చి 31 తో ముగిసింది. ఆయన గత మూడు రోజులుగా బూడిద చెరువు నుంచి నిబంధనలకు విరుద్ధంగా, భారీ స్థాయిలో బూడిద తరలిస్తున్నా రు. జన్కో అధికారుల, రాజకీయ నాయకుల అండదండలతో బూడిద తోలకాలు ఏదేచ్ఛగా సాగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలంటూ ఆదేశాలు జారీ చేయటం తప్ప, ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. అనుమతి లేకుండా తోలుతున్న బూడిద తోలకాలపై జె న్కో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించాలని ప్రభావిత ప్రాంత గిరిజన యువకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కేటీపీఎస్ 5 6 దశల సీఈ ప్రభాకర్ రావుని వివరణ కూడా, బూడిద సేల్ ఆర్డర్ పై ఫైల్ విద్యుత్ సౌదా లో ఉందని, ఫర్దర్ ఆర్డర్ వచ్చేవరకు పాత వారిని కొనసాగించాలని మౌఖిక ఆదేశాలు ఉన్నాయన్నారు.