01-03-2025 12:11:54 AM
హుజూర్ నగర్, ఫిబ్రవరి 28: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువులోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి జాతరలో భాగంగా నిర్వహిస్తున్న ఎద్దుల పందాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నలుమూలల నుండి మారుగా 50 జతల ఎద్దుల పాల్గొంటున్నాయి. విజేతలైన ఎద్దుల జతలకు మొదటి బహుమతులుగా ట్రాక్టర్లను, బుల్లెట్లను అందజేయనున్నారు. కాగా శుక్రవారం మూడో రోజు ఎద్దుల పందాలు ఓర ఓరిగా సాగాయి. పందాలను తిలకించడానికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు.