calender_icon.png 1 April, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్‌బై 70 చట్టాన్ని వెంటనే అమలు చేయాలి

29-03-2025 01:38:48 AM

ఎల్‌టీఆర్ కేసుల నమోదు పై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువు

ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తాటి సుధాకర్,సిద్ధ బోయిన భాస్కర్

మహబూబాబాద్.మార్చి 28:(విజయ క్రాం తి) ఏజెన్సీ మండలాల్లో అమలు పరచవలసిన వన్ బై 70 చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వెంటనే ఆ చట్టాన్ని అమలు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ సిద్దబోయిన భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షుడు మంకిడి సురేష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో అమలు చేయాల్సిన వన్ బై సెవెంటీ చట్టాన్ని అమలు చేయకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ విచ్చలివిడిగా రియల్ ఎస్టేట్ దందాకు సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఐటీడీఏ ఏటూరు నాగారం పరిధిలో ఎస్ డి ఇచ్చిన ఎల్ టి ఆర్ కేసులో జడ్జిమెంట్ ను కిందిస్థాయి రెవెన్యూ అధికారులు ఈరోజుకు పంచనామం చేసి ఆ భూములను గిరిజనులకు అప్పగించకపోవడంతో ఇప్పటికీ ఆ భూములు గిరిజన ఇతరుల  చేతులలో బందీలుగా ఉన్నాయని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోకి వలస వస్తున్న గిరిజన ఇతరులకు వన్ బై 70 చట్టం అంటే ఆట బొమ్మగా మారిపోయిందని జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు యంత్రాంగం ఆదివాసుల హక్కుల చట్టాలను పరిరక్షిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను అమల్లోకి తీసుకువచ్చి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దారం సాంబరాజు పూణ్యం జనార్ధన్ పెండకట్ల లక్ష్మీనరసి గుమ్మడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.