calender_icon.png 18 November, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 సేవలను బలోపేతం చేస్తున్నాం

18-11-2024 12:00:00 AM

భూపాలపల్లి ఘటనపై మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఘటనపై 108 సీఓఓ ఖాలీద్ ను విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 108 సేవలను అందించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందన్నారు.

అత్యవసర పరిస్థితులలో రోగులకు సేవలు అందించే 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్, పట్టణ ప్రాంతాలలో ఏదైనా అత్యవసర పరిస్థితులలో 108 నెంబర్‌కు సమాచారం వచ్చిన వెంటనే ప్రణాలను కాపాడేందుకు అత్యల్ప సమయంలో ఘటనాస్థలానికి వేగంగా చేరుకొని ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గర లోని ఆసుపత్రికి తరలిస్తారన్నారు.

అత్యల్ప సమయంలో ఘటన స్థలానికి వేగంగా చేరుకుని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించి తక్షణ చికిత్సను సేవింగ్ ద లైవ్స్ లో వైద్య సేవలు అందేవిధంగా భౌగోళికంగా నెట్వర్క్‌ను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.