28-08-2024 12:15:38 AM
ఎల్బీనగర్, ఆగస్టు 27: మైనర్‌ను వేధించిన నిందితుడికి ఎల్బీనగర్‌లోని పొక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. బాలాపూర్‌లోని జల్‌పల్లి శ్రీరామ్ కాలనీలో నివాసం ఉంటున్న భానుప్రకాశ్(20) 15 ఏండ్ల బాలికను వెంబడిస్తూ వేధిస్తున్నాడు. పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో 2019లో నిందితుడిపై పొక్సో కేసు నమోదైంది. కేసు పూర్వపరాలను పరిశీలించిన ఎల్బీనగర్ పొక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం నిందితు డికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.లక్ష పరిహరం అందజేసింది.