calender_icon.png 19 April, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో ఏడాది జైలు శిక్ష

05-04-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, (విజయక్రాంతి): అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష, రూ. 5 వేల జరిమాన విధించడంతోపాటు బాదితుడికి రూ. 1 లక్ష పరి హారం ఇప్పిస్తూ జగిత్యాల న్యాయమూర్తి వినీల్ కుమార్ తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 2017 సంవ త్సరంలో సారంగాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన కసాది చంద్రయ్య గొర్రెల మందతో ఇంటికి తిరిగి వస్తుండగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ అనే వ్యక్తి తన క్వాలిస్ వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ  ముందు నుండి వెళ్తున్న గొర్రెలను ఢీ కొట్టాడు.

ఈ సంఘటనలో 12 గొర్రెలు మరణించగా మరికొన్ని గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కసాది చంద్రయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్.ఐ రణధీర్  నిందితుడిపై  కేసు నమోదు చేసి  విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు. కోర్టు కానిస్టేబుల్ సురేష్  సాక్షులను ప్రవేశపెట్టగా అసిస్టెంట్ పబ్లిక్  ప్రాసిక్యూటర్ రజని తమ వాదనలు  వినిపించగా సాక్షులను విచారించిన  న్యాయమూర్తి వినీల్ కుమార్ నిందితుడికి 1 సంవత్సరం  జైలు శిక్ష,రు.5వేల జరిమాన విధిస్తూ, బాధితుడికి రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు.