calender_icon.png 12 January, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలరాముడికి ఏడాది

12-01-2025 12:49:22 AM

  • అయోధ్యలో అంగరంగ వైభవంగా వార్షికోత్సవం
  • ప్రారంభించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
  • మూడు రోజులపాటు వేడుకల నిర్వహణ
  • దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 11: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి సరిగ్గా ఏడాది పూర్తుంది. ఈ సందర్భంగా శనివారం తొలి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదట పం చామృతం, సరయూ నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో వేద పండితులు అభి షేకం నిర్వహించారు. అనంతరం యజుర్వేదాన్ని పారాయణం చేసి రామమం దిరంలో వార్షిక ఉత్సవాలను ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం మధ్యాహ్నం రామమందిరానికి చేరుకుని రామ్ లల్లాకు మహా హారితి ఇచ్చారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్ధం చేసిన 56 రకాల వంటకాలను బాల రాముడికి నైవేధ్యంగా సమర్పించారు. ఈ నెల 13 వరకు ఉత్సవాలు జరగనుండగా దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. దీంతో అయోధ్య నగరం ఆధ్యాత్మికశోభను సంతరించుకుంది. రామమందిర తొలి వార్షిక ఉత్సవాలను పురస్క రించుకుని దేశంలోని చాలా చోట్ల ప్రజలు దివ్వెలను వెలిగించి తమ భక్తిని వ్యక్త పరుస్తున్నారు. 

బాల రాముడికి ప్రత్యేక వస్త్రాలంకరణ

వార్షికోత్సవం పురస్కరించుకుని బాల రాముడిని ప్రత్యేక పసుపు రంగు పీతాంబరితో వేద పండితులు అలంకరించారు. రామ్ లల్లాకు ధరింప చేసిన పీతాంబరిని ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్లు బంగారు, వెండి దారాలతో ఎంతో నైపుణ్యంతో రూ పొందించినట్టు సమాచారం.

వార్షికోత్సవాలపై క్లారిటీ ఇచ్చిన ట్రస్టు

ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం గత ఏడాది జనవరి 22న బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అయితే దాదాపు 11 రోజుల ముందుగానే ఆలయ ట్రస్టు వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించింది. ఈ విష యంలో ట్రస్టు క్లారిటీ ఇచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్ష ద్వాదశి నాడు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా శుక్ల పక్ష ద్వాదశి (శనివారం) రోజున వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించినట్టు స్పష్టం చేసింది. 

ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

రామమందిర వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అయోధ్యలో శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం ద్వారా నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం. ఈ దివ్యమైన, అద్భుతమైన రామాలయం వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నా’నంటూ ట్వీట్ చేశారు. 

110 మంది వీఐపీలకు ఆహ్వానం

వార్షికోత్సవ వేడుల్లో పాల్గొనాల్సిందిగా 110 మంది వీఐపీలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ట్రస్టు వెల్లడించింది. గత సంవత్సరం జరిగిన ప్రణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన సాధువులు, ప్రముఖులకు ఆహ్వానాన్ని అందిం చినట్టు వెల్లడించింది. సాధారణ ప్రజలకు కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్టు స్పష్టం చేసింది. 

6 లక్షల శ్రీరామ మంత్రాల పఠనం

రామమందిరం పరిసరాల్లో ఏ ర్పాటు చేసిన యజ్ఞ మండపంలో వేద పండితులు శుక్ల యజుర్వేదంలో ని మంత్రాలతో అగ్నిహోత్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 8 గంటల వరకు, తిరిగి మధ్యా హ్నం 2 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో పండితులు శ్రీరామ మంత్రాన్ని దాదాపు 6 లక్షలసార్లు పఠించారు. అలాగే అంగద్ టీలా అ నే ప్రదేశంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రఖ్యాతగా యని ఉషా మంగేష్కర్, గాయకుడు మయూరేష్ పాయ్, సితార్ విద్వాంసులు సాహిత్య నహర్, వయోలిన్ విద్వాంసులు సంతోష్ నహర్, భరతనాట్య నృత్యకారిణి ఆనంద శంకర్ జయంత్ వంటి కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు.