18-02-2025 12:06:52 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : బ్యాంకులు ఒక సాధారణ రైతుకు రుణం ఇవ్వాలంటే అసలు ఆ రైతు తిరిగి చెల్లిస్తాడా? లేదా అనే వంద కోణాల్లో తనిఖీ లు చేపట్టి తీరా రుణం ఇంత వస్తది అంత వస్తది అని చెప్పి కాలం వెళ్లదీస్తారు. రుణం పొందే వ్యక్తి సివిల్ తో పాటు తదితర సమాచారం అధికారులకు నచ్చకుంటే ఆ రుణం కూడా ఇవ్వరు.
కాగా బ్యాంకు అధికా రుల లోపాల తప్పులు తడకగా ప్రక్రియలను అమలు చేస్తూ సహకార బ్యాంకుకు నష్టం వాటిల్లే పనులు చేస్తున్న పట్టింపు మాత్రం తక్కువగానే కనిపిస్తుంది.
ఈ తరుణంలో మహబూబ్ నగర్ డిసిసిబి లో కంప్యూటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సం బంధిత అధికారులను బాధ్యులను చేస్తూ రాష్ర్ట సహకార సంఘం పూర్తి విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వసూలు చేయాలని, ఆ డబ్బులకు 18 శాతం మిత్తి కూడా సంబం ధిత అధికారుల నుంచి రాబట్టాలని నివేదిక అందించింది.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా వసూలు చేయడం ప్రక్రియలో మాత్రం అల సత్వం కనిపిస్తుందని ఆరోపణలకు బలం చేకూరుతుంది.
అసలేం జరిగింది...
డిసిసిబి మహబూబ్ నగర్ అక్రమాలకు పుట్టిని ల్లు అనేలా 2020 సంవత్స రం నిలిచి పోయింది. ఈ ఏడాదిలో డీసీసీబ్యాంకు కోటి ఇరవై లక్షల విలువ గల కంప్యూటర్‌లను కొనుగోలు చేసింది. ఆ కొనుగోలులో సుమారు రూ 34 లక్షల అవినీతి జరిగిందని తెలంగాణ రాష్ర్ట సహకార చట్టంలోని సెక్షన్ 53 క్రింద రాష్ర్ట సహకార బ్యాంకు చేపట్టిన విచారణ నివేదిక స్పష్టం చేసిన విషయం విధితమే.
ఈ ఈ నష్టానికి బాధ్యులైన అప్ప టి ముఖ్య కార్యనిర్వాహక అధికారి, డీజి యంలు , మేనేజర్ నుండి పద్దెనిమిది శాతం వడ్డీతో కలిపి, అవినీతికి పాల్పడిన రూ 34 లక్షలు వసూలు చేయాలని నివేదికలో పొందుపరచారు.
వసూలు చేయవలసిన బాధ్యతను రాష్ర్ట సహకార సంఘాల రిజి ష్ట్రార్ మహబూబ్ నగర్ జిల్లా సహకార అధి కారికి రికవరీ బాధ్యత అప్పజెప్పారు. ఇప్ప టివరకు ఇటీవల కాలంలో రూ 34 లక్షలు వసూలు చేయడం జరిగింది. 18 శాతం మిత్తి మాత్రం వసూలు చేయడంలో అధికా రులు కొంతమేరకు అలసత్వం ప్రదర్శిస్తు న్నారని ఆరోపణలు వస్తున్నాయి.
బ్యాంకును కాపాడుకోవాలి..
రైతులకు అండగా ఉండాలని సంకల్పం తో ఆవిర్భావం అయినా సహకార బ్యాంకు లలో కొంతమంది అధికారులు చేతివృతం ప్రదర్శిస్తూ వారికి వారే సహకారం అందిం చుకుంటుండ్రు. దుర్వినియోగమైన రూ 34 లక్షలు మొత్తన్ని చెల్లించి వడ్డీని మాఫీ చె య్యాలని జిల్లా సహకార అధికారిని కోరా రు.
అందుకు స్పందించిన జిల్లా సహకార అధికారి వడ్డీ మాఫీకి జిల్లా బ్యాంకు సిఫార్సు చేయవచ్చని డీసీసీబీ కి లేఖ పంపి నట్లు సమాచారం. వడ్డీ మాఫీ సాధ్యం కాద ని భావించిన ఉన్నతాధికారులు వ్యూహాత్మక మౌనం వహించి జిల్లా సహకార అధికారి లేఖకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
నిజానికి నిబంధనల ప్రకారం వడ్డి మాఫీ కుదరదని నూతన విధా నాలకు శ్రీకారం చుట్టే పనిలో పడ్డారని తెలిసింది. డీసీసీబీ అధికారుల ఉదాసనతను ఆస రా చేసుకొని జిల్లా సహకార అధి కారి వివాస్పద నిరయానికి తెర లేపారు.
విచారణ నివేదికలో సూచించిన విధంగా పద్దెనిమిది శాతం వడ్డీ కాకుండా కేవలం 5.85 శాతం వడ్డీ చెల్లించాల్సిందిగా అపరాధులకు ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ తప్పు డు నిర్ణయం వలన డీసీసీబీకి సుమారు రూ. లక్షలలో నష్టం వాటిల్లుతుంది,
తక్కువ మిత్తి వసూలు చేయడం సరికాదు..
జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు సహే తుకం కాదని పేరు తెల్పడానికి ఇష్ట పడని ఒక విశ్రాంత సహకార ఉద్యోగి తన అభిప్రా యం వ్యక్తపరిచారు. సహకార సంఘాలలో నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు పద్దెని మిది శాతం వడ్డీ వసూలు చేయడం సర్వ సాథారణం. కోర్టులు కూడా ఈ వడ్డీ రేటుని సమర్థించే అని పేర్కొన్నారు.
బ్యాంకు ఋ ణాలపై వసూలు చేసే అత్యధిక వడ్డీ రేటును దర్వినియోగమైన నిధులపై వసూలు చేయ డం కొన్ని సందర్భాల్లో ఆమోదించబడినది. అలా చూసినా డీసీసీబీ ఋణాలపై అత్యధి కంగా పధ్నాలుగు శాతం వడ్డీ వసూలు చేస్తు న్నది. అలా కాకుండా 5.85శాతం వసూలు కు నిరయించడంలో ఔచిత్యమేమిటో సంబంధిత బాధ్యులే వివరించాలి.
రైతుల పంట ఋణాలపై కనీసం ఏడు శాతం వడ్డీ వసూలు చేయబడుతున్నది. అదికూడా సంవత్సరం పైబడి చల్లించకపోతే పదమూడు శాతం వడ్డీ వసూలు చేయబ డుతుంది. కనీసం రైతులనుండి వసూలు చేసే వడ్డీని కూడా అపరాధులకు విధించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
5.85 శాతం వడ్డీ డీసీసీచెల్లసొసైటీలకు పం ట లఋణాలపై విధించే వడ్డీ మాత్రమే. సంవత్సరం తర్వాత చెల్లించకపోతే అది కూడా పదకొండు శాతానికి పెరుగుతుంది. ఈ కేసులో అపరాధులు ఉన్నత విద్యావం తులు, డీసీసీబీ ఉన్నతాధికారులు. లక్షల్లో జీతాలు పొందుతున్నవారు.
దుర్వినియోగ మైన సొమ్మును వసూలుకు అన్ని అవకాశా లున్నప్పటికీ అపరాధులకు అతి తక్కువ వడ్డీ ప్రతిపాదించి డీసీసీబీ కి నష్టం కలిగించడం వెనుక, కుట్ర దాగున్నదని పలువురు అను మానం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ర్ట సహకార బ్యాంకు, రాష్ర్ట సహకార సఃఘాల రిజిస్ట్రార్ సత్వరం స్పందించి డీసీసీబీకి తద్వారా పేద రైతులకు జరిగే నష్టాన్ని నివారించాలని జిల్లా రైతాంగం కసహకార వ్యవస్థను కాపా డాల్సిన జిల్లా సహకార అధికారే నష్టం కలిగించే చర్యలకు పూనుకోవడం పట్ల రైతు లు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రక్రియ కొనసాగుతోంది...
కంప్యూటర్ల కొనుగోళ్ల విషయంలో ఉన్నత అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకా రం రూ 34 లక్షలు వసూలు చేయడం జరిగింది. మిత్తి విషయంలో నివేదిక ప్రకారం వసూలు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
- -పురుషోత్తం, ఇంచార్జి సీఈవో, డిసిసిబి , మహబూబ్ నగర్