న్యూఢిల్లీ: జాతీయ రహదారుల పై ప్రయాణించే వాహన దారులం దరికీ ఒకేరకమైన టోల్ విధానం అమలయ్యేలా ‘ఏకరీతి టోల్ విధానం’పై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రయాణికుల ఇబ్బందులకు ఇది చెక్ పెట్టనుందని తెలిపారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రోడ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అధిక టోల్ ఛార్జీలు విధిస్తుండటం పై వాహనదారుల్లో అసంతృప్తి గురించి ప్రస్తావించిన సందర్భంలో ఏకరీతిన టోల్ విధానం గురించి గడ్కరీ మాట్లాడారు. దీనికి సంబంధించి అదనపు వివరాలేవీ పంచుకో లేదు.
ప్రస్తుతం మన రోడ్లు అమెరి కా రహదారులతో సమానంగా ఉ న్నాయన్నారు. తొలుత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే టోల్ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో 7 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు.