calender_icon.png 2 April, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పన్ను చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్

27-03-2025 12:41:12 AM

పటాన్ చెరు, మార్చి 26 :మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ కు అవకాశం కల్పించినట్లు తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్సిపల్ కమిషనర్ లు సంగారెడ్డి, జ్యోతిరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన ఆస్తి పన్నుఒకే సారి చెల్లించే వారికి పెనాల్టీపై  ప్రభుత్వం 90శాతం రాయితీ కల్పించిందన్నారు. 

కేవలం పది శాతం పెనాల్టీతో ఆస్తి పన్ను చెల్లింపుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 31వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ లు వేరు వేరు ప్రకటనల్లో కోరారు. మీ సేవా కేంద్రాలలో, సిటిజన్ బడ్డీ యాప్ లో లేదా మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.