01-03-2025 12:32:23 AM
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖాతాదారులకు మరియు నిజామాబాదు / కామారెడ్డి జిల్లాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సభ్యులకు రైతు సోదరులకు ముఖ్య గమనిక. గత రెండున్నర సంవత్సరములుగా దీర్ఘకాలిక ఋణాల చెల్లింపు కాల పరిమితి ముగిసిన ఋణములకు ఏకకాల పరిష్కార పథకము రూపొందించబడిన విషయము రైతు సోదరులందరికీ విధితమే.
ఈ ప్రస్తావన సంవత్సరములో ఏకకాల పరిష్కార పథకములో భాగంగా వాయిదా మీరిన వడ్డిలో 40% వడ్డీ రాయితీ మరియు అపరాధ వడ్డీలో 100% వడ్డీ రాయితీ వెసులుబాటు కల్పించబడినది. ఇట్టి అవకాశము ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా బట్వాడా చేయబడిన దీర్ఘ కాలిక ఋణములకు మరియు నేరుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా బట్వాడా చేయబడిన నాన్ ఫామ్ సెక్టర్, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటి గ్రూప్ లు మరియు దీర్ఘకాలిక మార్టిగేజ్ ఋణములకు వర్తించును.
ఇట్టి ఏకకాల పరిష్కార పథకము వినియోగించుటకు తేది.31.03.2025 వరకు అవకాశము కలదు. కావున రైతు సోదరులందరు ఇట్టి అవకాశము సద్వినియోగం చేసుకొని లాభము పొందగలరు. మరిన్ని వివరముకై మీ దగ్గరలోని సహకార సంఘమును కాని జిల్లా కేంద్ర సహకార బ్యాంకును కాని సందర్శించి OTS విషయమై గల సందేహములు నివృత్తి చేసుకుని OTS సదుపాయముతో తేది.31.03.2025 లోగా ఋణ విముక్తులు కాగలరని అదేవిధముగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.
రైతులందరికీ సన్నరకం వడ్లకు క్వింటాల్ నకు రూ.500/- బోనస్ రాష్ట్ర ప్రభుత్వము వారు రైతుల బ్యాంకు ఖాతాలలోకి జమ చేయడం జరిగినదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత లేదని రైతులందరూ ప్రస్తుతము గల యూరియా స్టాక్ ను పొదుపు గా వాడుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు శ్రీ కుంట రమేష్ రెడ్డి గారు సూచించడం జరిగినది. ఇట్టి సమావేశములో బ్యాంకు ఉపాధ్యక్షులు శ్రీ నల్ల చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ లింగయ్య పాల్గొనడం జరిగినది.