calender_icon.png 22 February, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే దఫాలో పరిహారం

14-02-2025 12:46:45 AM

జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్ 

వికారాబాద్, ఫిబ్రవరి 13: పారిశ్రామిక వాడకు భూములను ఇచ్చేందుకు సమ్మతించిన  రైతులకు ఒకే దఫాలో నష్ట పరిహారాన్ని  అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో  పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం  అసైన్డ్ భూములకు సంబంధించిన దుద్యాల్ మండలం లగచర్ల గ్రామ రైతులతో కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... పారిశ్రామిక వాడకు భూములను ఇచ్చేందుకు సమ్మతించిన రైతులకు చెక్కుల రూపంలో   నష్టపరిహారంతో పాటు  అప్రూవ్ లేఅవుట్ ప్రకారం ఇంటి స్థలాలను కేటాయించడం జరుగు తుందన్నారు.

లగచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 102 లో 36 మంది రైతులకు సంబంధించిన  58  ఎకరాల భూమి ఉందని దీనిపై రైతులతో చర్చ నిర్వహించి రైతుల సమ్మతాన్ని పొందినట్లు కలెక్టర్ తెలిపారు. ఎకరానికి 20 లక్షలు, ఎకరానికి 150 గజాల ఇంటి స్థలములో ఇందిరమ్మ ఇల్లు, అర్హతల మేరకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.