calender_icon.png 2 January, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయ్యి గంజాయి చాకెట్లు పట్టివేత

30-12-2024 02:20:27 AM

*  ఆరుగురు నిందితుల అరెస్టు

సూర్యాపేట, డిసెంబర్ 29 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెం వద్ద సుమారు వెయ్యి గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. కోదాడలో మీడియా సమావేశంలో ఎక్సైజ్ సీఐ శంకర్ కేసు వివరాలను వెల్లడించారు.

భువనేశ్వర్ నుంచి హైద్రాబాద్‌కు వెళ్తున్న బస్సుల్లో తనిఖీ చేయగా 25 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు గుర్తించామని, ఇందులో సుమారు వెయ్యి చాక్లెట్లు ఉన్నాయన్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు మగవారు ఉన్నారు. మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎస్సైలు గోవర్ధన్, రామకృష్ణ, యాదయ్య పాల్గొన్నారు.