అపరిశుభ్ర వాతావరణంలో తయారీ
నిబంధనలకు విరుద్ధంగా మానుఫ్యాక్చరింగ్
రాజేంద్రనగర్, నవంబర్ 20: నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్న వెయ్యి కిలోల అల్లంపేస్ట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో భాగంగా సీజ్ చేశారు. ఫుడ్ సేప్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం కాటేదాన్ పారి శ్రామికవాడలోని ఎస్‌కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్, యుమాని ఫుడ్ ఇటర్నేషనల్ కంపెనీల్లో తనిఖీలు నిర్వహిం చా రు. అల్లం తయారీకి సంబంధించి వీరి కి అనుమతులు లేవని, సరైన ప్రమాణాలను సైతం పాటించడం లేదని గుర్తించారు.
ఈ నేపథ్యంలో వెయ్యి కిలోల అల్లవెల్లుల్లి పేస్ట్‌ను స్వా ధీనం చేసుకున్నారు. తయారీకి వినియోగించే ఇతర పదార్థాలను కూడా సీజ్ చేశారు. శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు తరలించినట్లు అధికా రులు పేర్కొన్నారు. నివేదిక అందిన తర్వాత చర్య లు తీసుకుంటామని వెల్లడించారు.