- సప్లయ్ చేస్తున్న ఆరు జలాంతర్గాముల సీజ్
- ఆపరేషన్‌లో పాల్గొన్న 62 దేశాలు
న్యూఢిల్లీ, నవంబర్ 29: వివిధ దేశాలకు సప్లయ్ చేస్తున్న 1400 మెట్రిక్ టన్నుల డ్రగ్స్‌ను కొలంబియా నేతృత్వంలో అంతర్జాతీయ భద్రతా బృందాలు పట్టుకున్నాయి. డ్రగ్స్ సరఫరాకు వాడుతున్న ఆరు జలాం తర్గములను కూడా సీజ్ చేశారు. కాగా మొత్తం 62 దేశాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. దాడుల్లో పట్టుబ డిన డ్రగ్స్‌లో 225 టన్నుల కొకైన్ కూడా ఉన్నట్లు కొలంబియా నేవీ ఆపరేషన్స్ చీఫ్ వెల్లడించారు.
కొలం బియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న ఓ జలాంతర్గామిలో ఐదు టన్నుల కొ కైన్‌ను గుర్తించామని.. ఈ నౌకను పసిఫిక్ జలాల్లో అడ్డగించగా, ఆస్ట్రేలియా తీరానికి చేరుకునేందుకు సరిపడా ఇం ధనం అందులో ఉన్నట్లు చెప్పారు. ముందుగా ఈ లాంతర్గామిని కొలంబియా జలాల్లో గుర్తించి.. అది వెళ్తున్న దారిని పసిగట్టి ఆస్ట్రేలియా భద్రతా దళాలతో కలిసి ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు.