స్కాట్‌లాండ్ వైట్‌హౌస్ వద్ద గుర్తించిన ఇంజినీర్ల బృందం
న్యూఢిల్లీ, నవంబర్ 28: స్కాట్‌లాండ్‌లో 132ఏళ్ల నాటి సందేశంతో కూడిన గాజు సీసా ఇటీవల బయటపడింది. రిన్స్ ఆఫ్ గాల్లోవే ఉత్తర భాగంలోని కోర్స్‌వాల్ లైట్‌హౌస్ వద్ద మరమ్మతులు చేసిన రాస్ రస్సెల్ అనే మెకానికల్ ఇంజినీర్ బృందం లైట్‌హౌస్ పైభాగం లోని గోడలో కార్క్‌తో కూడిన గాజు సీసాను గుర్తించారు. దాదాపు 20 సెంటీమీటర్ల గాజు సీసాలో ఓ చీటీ ఉన్నట్టు గమనించి దాన్ని బయటకు తీశారు. కాగితంపై 132ఏళ్ల క్రితం లైట్‌హౌస్ వద్ద విధులు నిర్వర్తించిన ఇంజనీర్ల పేర్లు, వాళ్లు చేసిన పనులకు సంబంధించిన వివరాలు ఉండటంతో ఆశ్చర్యపోయినట్టు మీడియాకు తెలిపారు.
చీటీ ద్వారా అప్పుడు పని చేసిన ఇంజినీర్లు తమతో నేరుగా మాట్లాడినట్టు భావిస్తున్నట్టు రాస్ పేర్కొన్నారు. తొలుత తానే ఆ గాజును సీసాను తాకడంవల్ల వింత అనుభూతి పొందినట్టు వివరించారు.